: నటి మీనాకు పితృ వియోగం
ప్రముఖ సినీ నటి మీనాకు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి దొరైరాజ్ నిన్న రాత్రి గుండె పోటుతో మరణించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. దొరైరాజ్ తమిళనాడుకి చెందిన వ్యక్తికాగా, ఆయన భార్య మల్లిక కేరళ రాష్ట్రానికి చెందినది. వీరిద్దరికీ మీనా ఒక్కతే సంతానం. హీరోయిన్ గా మీనా ఎదగడం వెనుక ఆమె తండ్రి సహకారం కూడా ఎంతో ఉంది.