: ఐఐటీ-జేఈఈలో సత్తా చాటిన సూపర్ 30... 30 మందికి 27 మంది ఉత్తీర్ణత


బీహార్ లోని 'సూపర్ 30' సంస్థ నుంచి శిక్షణ పొందిన 30 మంది విద్యార్థుల్లో ఏకంగా 27 మంది ఐఐటీ-జేఈఈలో ఉత్తీర్ణత సాధించారు. ప్రతియేటా పేద కుటుంబాలకు చెందిన 30 మంది మెరికల్లాంటి విద్యార్థులను ఎంచుకుని వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా, భోజన వసతిని కూడ సూపర్ 30 కల్పిస్తుంది. తమ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారని సంస్థ డైరెక్టర్ ఆనంద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తినేటప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఇలా ఎల్లవేళలా ఐఐటీ గురించే ఆలోచించాలని తమ విద్యార్థులకు చెబుతుంటామని ఆనంద్ తెలిపారు. ఇదే తమ విజయానికి కారణమని చెప్పారు.

  • Loading...

More Telugu News