: నవ్వులు పూయించేందుకు విరాట్ కోహ్లీ రెడీ
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్ లో పాప్యులర్ టీవీ కామెడీ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' లో కోహ్లీ పాల్గొంటున్నాడు. ఆ ఎపిసోడ్ కు సంబంధించి నేడు షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయమై కార్యక్రమం యాంకర్ కపిల్ స్పందిస్తూ, కోహ్లీతో ఎపిసోడ్ షూట్ చేయబోతున్నామని, కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు పంపాలంటూ అభిమానులను ట్విట్టర్లో కోరాడు.