: ఆయన పొన్నాల లక్ష్మయ్య కాదు... ప్రెస్ మీట్ల లక్ష్మయ్య: కోమటిరెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ... టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతున్నాడని... తానైతే ఓటమికి బాధ్యత వహిస్తూ ఎప్పుడో రాజీనామా చేసేవాడినని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ... పొన్నాల లక్ష్మయ్య కాస్తా ప్రెస్ మీట్ల లక్ష్మయ్యగా మారారని సెటైర్ విసిరారు. పీసీసీ అధ్యక్షుడిగా యువకుడిని నియమించాలని అభిప్రాయపడ్డారు.
2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కోమటి రెడ్డి ఎద్దేవా చేశారు. పీపీఏలను రద్దు చేయాలనుకుని తెలంగాణ ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారని... ఇప్పడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారని ప్రశ్నించారు.