: అన్నింటా జగన్ ఏ1.. అదే వైఎస్ లక్ష్యమన్న బాబు


కుమారుడు జగన్ ను అన్ని విషయాల్లోనూ నెంబర్ వన్ గా చూడాలన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్ష నేడు నెరవేరిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ తన ఛార్జిషీటులో జగన్ ను ఏ1గా పేర్కొందని ,దీంతో వైఎస్ కల సాకారమైందని బాబు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారని వైఎస్ కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News