: వివాదాస్పదమైన రవీంద్రనాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం
కడప జిల్లా కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం వివాదాస్పదమైంది. నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా 'వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ సాక్షిగా...' అంటూ రవీంద్రనాథ్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని తేల్చిన అధికారులు రేపు ఆయనతో మరోసారి ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు.