: బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో నేడు మరో తెలుగు విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని హైదరాబాదు ఏఎస్ రావు నగర్ కు చెందిన సాయిరాజ్ గా గుర్తించారు. మొత్తం 24 మంది గల్లంతవగా, ఇప్పటివరకు 13 మృతదేహాలు లభ్యమయ్యాయి.