: ప్రజలు గమనిస్తుంటారు... హుందాగా మెలగండి: కోడెల
స్పీకర్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులకు కోడెల శివప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. సభలో అధికార, ప్రతి పక్షాలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభలో జరిగే చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అభిలషించారు. చర్చలు జరిగే విధంగా అందరూ సహకరించుకోవాలని పేర్కొన్నారు. సభ తీరును ప్రజలు గమనిస్తుంటారని ఈ సందర్భంగా స్పీకర్ హెచ్చరించారు.