: క్రిష్టియానో రొనాల్డోకు తలనొప్పిగా పరిణమించిన ప్రియురాలు
అనితరసాధ్యమైన ఆటతీరుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిష్టియానో రొనాల్డోకు అతని ప్రేయసి, బ్రెజిల్ మోడల్ ఆండ్రెసా ఉరాచ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. రోనాల్డోకు, తనకు శారీరక సంబంధం ఉందని గతేడాది బయటపెట్టి సంచలనం రేపిన ఉరాచ్ వ్యాఖ్యలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థంకాక తలపట్టుకున్నాడీ ఫుట్ బాల్ స్టార్. సాకర్ ప్రపంచకప్ సందర్భంగా శరీరానికి రంగు (బాడీ పెయింట్) పులుముకుని పోర్చుగల్ జట్టుకు స్వాగతం పలికి మరో సంచలనం సృష్టించింది. రోనాల్డో ప్రాక్టీస్ చేస్తుండగా సెక్యూరిటీని ఛేదించుకుని మైదానంలోకి వెళ్లింది. దీంతో ప్రేయసి చేస్తున్న తిక్క పనులతో ఏం చేయాలో తోచక రొనాల్డో తలపట్టుకుంటున్నాడు.