: 15 ఏళ్లలో హైదరాబాద్ మూడింతలు విస్తరిస్తుంది: కేటీఆర్


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. భౌగోళికంగా హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతమని... అందుకే పెట్టుబడి దారులు నగరం వైపు చూస్తున్నారని చెప్పారు. రాబోయే 15 ఏళ్లలో హైదరాబాద్ నగరం మూడింతలు విస్తరిస్తుందని అన్నారు. భువనగిరి, షాద్ నగర్, గజ్వేల్ లాంటి ప్రాంతాల వరకు నగరం విస్తరిస్తుందని చెప్పారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే... సిటీలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై భారీ అంచనాలున్నాయని... ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News