: హైదరాబాదును ఆరోగ్య రాజధానిగా చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్య రాజధానిగా చేసేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ తో పాటు హెల్త్ కార్డులను కూడా ఇస్తామని చెప్పారు. హైదరాబాదులో ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సదస్సును ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో తప్ప తెలంగాణలో మరెక్కడా ఉన్నత స్థాయి ఆరోగ్య వసతులు లేవని చెప్పారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని... రెండు రెట్లు అధికంగా నిధులు ఇస్తామని తెలిపారు. మెడికల్ టూరిజంకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మెడికల్ సీట్ల పెంపు కోసం సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళతారని వెల్లడించారు.