: భారత మోడల్ ను పెళ్ళాడిన ఆసీస్ క్రికెటర్


ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ షాన్ టెయిట్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి, భారత మోడల్ మాషూమ్ సింఘాను టెయిట్ గతవారం వివాహమాడాడు. వీరి వివాహ వేడుక భారత్ లోనే జరిగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, స్క్వాష్ క్రీడాకారుడు రిత్విక్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. ఐపీఎల్ వీరిద్దరి పరిచయానికి వేదికైంది. గత నాలుగేళ్ళుగా కొనసాగుతున్న వీరి ప్రేమాయణానికి పెళ్ళితో తెరపడినట్టయింది.

  • Loading...

More Telugu News