: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీీతారామన్ కు పార్లమెంటుకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటును బీజేపీకి కేటాయించింది. దాంతో తెలుగింటి కోడలైన నిర్మలా సీతారామన్ ఏపీ నుంచే పార్లమెంటుకు వెళుతున్నారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి ఆమె నామినేషన్ వేయనున్నారు.