: మలింగ.. వచ్చేశాడు!
గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన ముంబయి ఇండియన్స్ యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో పోరుకు సిద్ధమయ్యాడు. మలింగ.. ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ తో కొత్త బంతిని పంచుకుంటాడు. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో ముంబయి వాంఖెడే మైదానంలో మ్యాచ్ ఆరంభం కానుంది.