: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మాలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయాలని బీజేపీ నిర్ణయించింది. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ స్థానానికి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ను నామినేట్ చేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ తెలిపారు. కాగా, నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జూన్ 23. జూలై 3న ఎన్నికలు నిర్వహించనున్నారని ఆయన వెల్లడించారు.