: ఏపీ వాణి ఢిల్లీలో వినిపించిన కంభంపాటి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో టీడీపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించాలని కేంద్ర మంత్రి ఉమాభారతికి విజ్ఞప్తి చేశానని అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసి అధికారుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని సూచించానని ఆయన తెలిపారు. ఇరాక్ లోని తెలుగు వారిని స్వదేశానికి రప్పించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను కోరినట్టు ఆయన చెప్పారు. అందరూ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News