: దిగజారిన సైనా నెహ్వాల్ ర్యాంక్
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో సైనా నెహ్వాల్ ర్యాంక్ పడిపోయింది. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 9వ స్థానంతో సరిపెట్టుకుంది. పీవీ సింధు 10వ స్థానంలో కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు ఎగబాకి 18వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక, కిడాంబి శ్రీకాంత్ టాప్-25లో చోటు కోల్పోయాడు. శ్రీకాంత్ 29వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు.