: స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన కోడెల
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీ కూడా కోడెల అభ్యర్థిత్వానికి అంగీకరించడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా ఆరోసారి ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.