: ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై కేంద్రం సీరియస్


తెలంగాణ జిల్లాల్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేయడం పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అంశంపై తన కార్యదర్శి బిమల్ జుల్కా, ఇతర అధికారులతో చర్చించారు. ఈ వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. టీవీ చానళ్ళ ప్రసారాలను నిలిపివేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, వ్యక్తుల ఒత్తిడితో నిలిపివేత నిర్ణయాలు తీసుకున్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని జవదేకర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News