: పగలు షూటింగ్.. రాత్రి డబ్బింగ్!
ముంబయి వరుస పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన చిత్రాలను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో జైలుకెళ్ళనున్న నేపథ్యంలో సంజయ్ రోజుకు రెండు షిప్టుల పాటు కష్టించి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సంజయ్ దత్ 'పోలీస్ గిరి' చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాడు. పగలంతా 'పోలీస్ గిరి' షూటింగ్ లో పాల్గొనడం, రాత్రిళ్ళు తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం.. ఇలా సాగుతోంది సంజయ్ దత్ దినచర్య. కుటుంబ సభ్యులతో గడిపేందుకు కూడా సంజయ్ దత్ కు సమయం చాలడం లేదట.