: ప్రసారాల నిలిపివేతకు సూత్రధారి కేసీఆర్: మందకృష్ణ


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో ఏబీఎన్ చానల్ ప్రసారాల నిలిపివేతకు ప్రధాన సూత్రధారి కేసీఆరేనని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి పాత్ర ఉందని దుయ్యబట్టారు. ఇక, హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటన అత్యంత విషాదకరమని చెప్పారు. విద్యార్థుల మృతికి విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఇదే కళాశాలలో చదువుకున్నారని, అందుకు ఈ కళాశాలపై చర్యలు తీసుకోవడం లేదని మంద కృష్ణ ఆరోపించారు. కళాశాల నిర్లక్ష్యంపై రేపు తాము హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News