: హార్డ్ వేర్ రంగంలోనూ హైదరాబాదును ముందుకు తీసుకెళతాం: కేటీఆర్


సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచస్థాయి అందుకున్న హైదరాబాదును హార్డ్ వేర్ రంగంలోనూ అభివృద్ధి చేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాదు దేశంలో రెండోస్థానంలో ఉందని, హార్డ్ వేర్ రంగంలోనూ నగరాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తామని కేటీఆర్ చెప్పారు. శంషాబాద్ సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన గాడ్జెట్ ఎక్స్ పో-2014 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాలుగురోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News