: చెన్నై, బెంగళూరు, శంషాబాద్ విమానాశ్రయాలకు ఐబీ హెచ్చరికలు
దక్షిణ భారత దేశంలోని ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు విమానాశ్రయాలను ఐబీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. శ్రీలంక ద్వారా ఉగ్రవాదులు దేశంలో చొరబడి, దక్షిణ భారత దేశంలోని విమానాశ్రయాలపై దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో సీఐఎస్ఎప్ శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేసింది.