: యమహా బైక్.. ధర రూ. 25000 మాత్రమే!


జపాన్ మోటార్ సైకిల్ తయారీ దిగ్గజం యమహా ప్రపంచంలోనే అత్యంత చవకైన బైక్ రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత మార్కెట్లో దీని ఖరీదు సుమారు రూ. 25,000 ఉంటుందని సమాచారం. ఈ బైక్ ను భారత్ లోనే తయారు చేయాలని యమహా సంకల్పించింది. అందుకోసమే గత ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లోని సూరజ్ పూర్ వద్ద యమహా.. 'పరిశోధన-అభివృద్ధి' కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ఈ యూనిట్లో తాజా బైక్ కు సంబంధించిన కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.

ఈ విషయమై యమహా ఇండియా మేనేజింగ్ డైరక్టర్ తొషికజు కొబయాషి మాట్లాడుతూ, ఈ బైక్ ను 100సీసీ శక్తితోగానీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతోగానీ రూపొందిస్తామని వెల్లడించారు. ఈ నూతన బైక్ ను తొలుత భారత్ లో ప్రవేశపెట్టి ఆనక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం భారత మార్కెట్లో హీరో, బజాజ్, హోండా బైక్ ల ధాటికి బాగా వెనకబడిపోయిన యమహా మళ్ళీ తన పూర్వ వైభవం సాధించేందుకే ఈ 'చవక బైక్' రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News