: టీవీ ఛానళ్లను నిలిపివేయడంతో ప్రభుత్వ పాత్ర లేదు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేసిన విషయంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. టీవీ ఛానళ్లను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర లేదని అన్నారు. కేబుల్ పరిశ్రమ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని ఆయన అన్నారు.