: సినీ నటి రోజా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినీ నటి రోజా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలవ్వగా, 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్ కె రోజాతో ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామినాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. సినీ నటిగా సుదీర్ఘకాలం అలరించిన నటి రోజా రాజకీయాలపై మంచి పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్ని పలు వేదికలపై సమర్ధవంతంగా వివరించారని రోజాకు మంచి పేరు ఉంది.