: బెంగళూరులో అంజలి!


సంచలనం సృష్టించిన హీరోయిన్ అంజలి అదృశ్యం కేసు మిస్టరీ విడినట్టే కనిపిస్తోంది. అంజలి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. హిందీలో హిట్టయిన 'బోల్ బచ్చన్' తెలుగు రీమేక్ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తోంది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, రామ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లో రామ్, అంజలిపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. చిత్రహింసలు పెడుతోందంటూ తన పిన్నిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. తానెక్కడున్నదీ వెల్లడిస్తే, వివరణ కోసం వచ్చే మీడియా కారణంగా షూటింగ్ కు అంతరాయం కలుగుతుందనే.. అంజలి తన ఆచూకీపై గోప్యత పాటించి ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News