: రక్షించండి మహాప్రభో..!
ఐఎస్ఐఎల్ తీవ్రవాదుల ధాటికి కుదేలైన ఇరాక్ సర్కారు అగ్రరాజ్యం అమెరికాను శరణువేడింది. ఇప్పటికే ఇరాక్ లోని అతిపెద్ద భైజీ చమురు శుద్ధి కర్మాగారంతోపాటు దేశ ఉత్తర ప్రాంతంలోని పలు పట్టణాలు తీవ్రవాదుల ప్రాబల్యంలోకి వెళ్ళాయి. దీంతో, ఇరాక్ ప్రధాని నూరి అల్ మాలిక్ అమెరికాను సాయం కోరారు. మిలిటెంట్లపై వైమానిక దాడులు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారికంగా తాము వాషింగ్టన్ వర్గాలను కోరినట్టు ఇరాక్ సర్కారు తెలిపింది.