: ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటిస్తాం: కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. బెల్టు షాపులను తొలగించేందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. చేనేత రుణాలు 100 కోట్ల రూపాయల వరకు మాఫీ చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రైతు రుణ మాఫీపై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.