: హస్తిన వెళ్లనున్న సీఎం కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 15న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించనున్న సమావేశంలో కిరణ్ పాల్గొంటారు. ఇదే సమయంలో అధిష్ఠానంతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.