: రుణమాఫీ అంశంలో జగన్ గాభరాపడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన కె. అచ్చెన్నాయుడు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం పట్ల తాము చిత్తశుద్ధితో ఉన్నామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ గాభరాపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమే ఉంటే దోచుకున్న లక్ష కోట్లతో వారి రుణాలను మాఫీ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల ప్రాధాన్యత విస్మరించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సర్కారు క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.