: టీడీపీ కార్యకర్తలకు లైఫ్ ఇన్సూరెన్స్ : నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కార్యకర్తలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్టు పార్టీ సమన్వయకర్త నారా లోకేశ్ పేర్కొన్నారు. పార్టీలో ప్రత్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మహానాడులో వచ్చిన విరాళాలతో కలిపి రూ.20 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యకర్తల ఆర్ధిక అభ్యున్నతికి తాము కట్టుబడి ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు. నాయకులైతే తనను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని, కార్యకర్తలు మాత్రం నేరుగా తనను కలవొచ్చంటూ... వారి పట్ల పార్టీ వైఖరిని చాటారు.