: లేక్ వ్యూ అతిథి గృహానికి చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు. లేక్ వ్యూలో ఈ రోజు ఉదయం 8.09 గంటలకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, నారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. విశాఖపట్నం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేశారు.

  • Loading...

More Telugu News