: టీడీపీ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్
తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.