: ధరలు తగ్గించకుంటే... ఒక్క ప్లాంట్ కూడా నడవనివ్వం: సీఎం రమేష్


పెంచిన సిమెంట్ ధరలను పదిహేను రోజుల్లో తగ్గించకుంటే జిల్లాల్లో ఉత్పత్తి, రవాణాను అడ్డుకుంటామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హెచ్చరించారు. కడపలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నిర్మాణం నేపథ్యంలో సిమెంట్ భారీగా అవసరమవుతుందని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గించకుంటే రాష్ట్రంలోని ఒక్క ప్లాంట్‌ను కూడా నడవనివ్వమని అన్నారు. రుణమాఫీని అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని, పదేళ్ల పాటు ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా చేశారని... ఇకపై ఈ ఆటలు చెల్లవని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News