: రాజీనామాకు సబిత రెడీ..వద్దంటోన్న సహచర మంత్రులు
జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సహచర మంత్రులు బాసటగా నిలిచారు. సబితను అక్రమాస్తుల కేసులో ఎ4గా పేర్కొంటూ కోర్టులో నిన్న సీబీఐ ఐదవ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు సబిత సిద్ధపడినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సహచర క్యాబినెట్ మంత్రులు పలువురు హోం మంత్రి నివాసానికి చేరుకుని నచ్చచెబుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయవద్దని వారు సబితకు సూచిస్తున్నారు.