: చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎంఎస్ వోలు టీవీ ప్రసారాలను ఆపేయడం మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంటనే టీవీ9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలన్నారు. మీడియాను నియంత్రించాలనుకోవడం సరి కాదని చెప్పారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్, పోలవరం, హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు సరైనవి కావని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ అంశాలపై ఇరు రాష్ట్రాలు కలసి చర్చలు జరపాలని సూచించారు.