: హైదరాబాదులో నిర్భయ కేసు నమోదు


హైదరాబాదులోని మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ లో నిర్భయ కేసు నమోదైంది. కర్నూలు జిల్లాకు చెందిన హరికృష్ణపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హరికృష్ణను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా అతను పరారీలో ఉన్నాడని తేలింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళలపై అత్యాచారం, అఘాయిత్యం జరిగితే నిర్భయ చట్టంపై కేసు నమోదు చేస్తారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News