: విజయవాడ-గుంటూరుకు రాజధానికి కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయ్
విజయవాడ-గుంటూరు పరిధిలో రాజధానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణ తెలిపారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్ తరహాలో రాజధానిని ఇక్కడ నిర్మించుకోవచ్చని ఆయన అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో అధికారులతో సమావేశమై... విజయవాడ, గుంటూరు అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించామని సుధీర్ కృష్ణ చెప్పారు.