: ఇరాక్ లో 40 మంది భారతీయుల అపహరణ
ఇరాక్ దేశంలోని మోసుల్ లో తారిఖ్ ఉర్ అల్ హూద్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయులు అపహరణకు గురైనట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 40 మంది భవన నిర్మాణ కార్మికులు అపహరణకు గురయ్యారని, వారు ఉత్తర భారతదేశానికి చెందిన వారని విదేశాంగ శాఖ పేర్కొంది. అపహరణకు సంబంధించి ఎవరి నుంచి ఫోన్ కాల్స్ రాలేదని తెలిసింది. అపహరణకు గురైన వారి రక్షణ చర్యలు చేపట్టామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇరాక్ లో ఉన్న 46 మంది నర్సులతో మాట్లాడామని, వారు భారత్ కు రావాలని కోరుకుంటున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.