: మనం రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి: గల్లా జయదేవ్
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు తిరుపతిలో ఘనస్వాగతం లభించింది. ఎంపీగా ఎన్నికైన అనంతరం తిరుపతికి వచ్చిన ఆయనకు భారీగా తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం రాష్ట్రాన్ని మరోసారి నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. తిరుపతి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలపైన, నేతలపైన గురుతర బాధ్యతలు ఉన్నాయని ఆయన చెప్పారు. వాటన్నింటిని అందుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు.