: టీవీ సీరియల్లో 'క్రికెట్ దేవుడు'!
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ త్వరలో ఓ టీవీ సీరియల్లో నటించనున్నాడు. ఇంతకుముందు కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సచిన్ ఓ ధారావాహికలో నటించనుండడం ఇదే తొలిసారి. అయితే, ఇదో యానిమేషన్ సీరియల్ అని తెలుస్తోంది. ఇందులో క్రికెటే కథాంశంగా ఉంటుంది. ఈ కామెడీ అడ్వెంచర్ సీరియల్ పేరు 'మాస్టర్ బ్లాస్టర్స్'. ఒక్కొక్కటి 22 నిమిషాల చొప్పున మొత్తం 26 ఎపిసోడ్స్ ఉంటాయి. 3డి పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ ధారావాహికను షిమారూ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఆద్యంతం సరదాగా సాగే ఈ క్రికెట్ సీరియల్లో సచిన్ తో పాటు 12 మంది చిన్నారులు కూడా నటిస్తారు. అన్నట్టు, ఓ కుక్క కూడా ఈ సీరియల్లో నటించనుంది.