: 25 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించిన కార్మిక శాఖ


హైదరాబాదు పాతబస్తీలోని భవానీ నగర్ లో ఇవాళ కార్మికశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో దుకాణాల్లో బాలకార్మికులు పనిచేస్తున్నట్టు వారు గుర్తించారు. 25 మంది బాలకార్మికులకు కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు. లేబర్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న బాలలతో పనిచేయించడం నేరమన్న విషయం విదితమే. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, దుకాణాల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News