: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చిన ఆర్థిక శాఖ ఉద్యోగులు
ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ ఆర్థిక శాఖ ఉద్యోగులు 1.8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగులు తమ సమస్యలను కంప్లయింట్ సెల్ కు తెలపాలని ఆయన చెప్పారు.