: డీఎల్ఎఫ్ కు ఎల్డీఎఫ్ సెగ... కేరళ ఝలక్


డీఎల్ఎఫ్ ప్రాజెక్టుపై ఎల్డీఎఫ్ సెగ పెట్టింది. దీంతో కేరళ ప్రభుత్వం డీఎల్ఎఫ్ సంస్థకు ఝలక్ ఇచ్చింది. కోచీలో కాంప్లెక్సు నిర్మించేందుకు డీఎల్ఎఫ్ సంస్థకు కేరళ ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా డీఎల్ఎఫ్ సంస్థలకు నిర్మాణ పనులు కట్టబెట్టారని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న డీఎల్ఎఫ్ కంపెనీకి కాంగ్రెస్, యూడీఎఫ్ ప్రభుత్వం నిర్మాణ పనులు కట్టబెట్టారని ఎల్డీఎఫ్ ఆరోపించింది.

డీఎల్ఎఫ్ కు కాంప్లెక్సు నిర్మాణ పనులు కట్టబెట్టడంలో అవినీతి చోటుచేసుకుందని ఎల్డీఎఫ్ స్పష్టం చేసింది. రాజకీయంగా లబ్ది పొందడం కూడా అవినీతిలో భాగమేనని ఎల్డీఎఫ్ తెలిపింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుండడంతో కేరళ ప్రభుత్వం దిగి వచ్చింది. డీఎల్ఎఫ్ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పర్యావరణ శాఖ ఇచ్చిన క్లియరెన్స్ మేరకే డీఎల్ఎఫ్ కు అనుమతిచ్చామని ముఖ్యమంత్రి ఊమన్ చాందీ తెలిపారు.

  • Loading...

More Telugu News