: తెలంగాణ పల్లెల్లో 85 శాతం మంది నిరుపేదలే: మంత్రి పోచారం
తెలంగాణ పల్లెల్లో 85 శాతం మంది నిరుపేదలేనని, వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రైతులకు చెందిన రూ.22 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని, బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. రుణాలు మాఫీ చేసిన రైతులకు త్వరలో ఖరీఫ్ రుణాలు అందిస్తామని ఆయన అన్నారు.