: ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్న దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. సికింద్రాబాదు-హజరత్ నిజాముద్దీన్ ల మధ్య రెండు ప్రీమియం ప్రత్యేక రైళ్లతో పాటు సికింద్రాబాదు - గౌహతి మధ్య ఒక ప్రత్యేక రైలును నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రీమియం ప్రత్యేక రైళ్లకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు.
సికింద్రాబాదు నుంచి గౌహతికి నెం.07249 ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీన సికింద్రాబాదు నుంచి ఉదయం 7.30 గంటలకు బయల్దేరి 29వ తేదీ ఉదయం 7.30కు గౌహతి చేరుతుంది. అలాగే నెం.07250 రైలు ఈ నెల 30వ తేదీన గౌహతి నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి జూలై 2వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాదు చేరుతుంది.
సికింద్రాబాదు నుంచి నెంబరు 02723 ప్రీమియం ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీన ఉదయం 11.55కు బయల్దేరి మరునాడు మధ్యాహ్నం 1.25కి హజరత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. అలాగే అక్కడి నుంచి నెం.02724 రైలు ఈ నెల 30వ తేదీన రాత్రి 7.20కి బయల్దేరి మరునాడు రాత్రి 8.55కి సికింద్రాబాదు స్టేషనుకు చేరుకుంటుంది.