: పీపీఏ రద్దు చేయడం ఏపీకి సరికాదు: జానారెడ్డి
ఏపీ జెన్ కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దుచేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఈఆర్సీ (ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్) న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం తమకు ఉందని తెలిపారు. తెలంగాణకు విద్యుత్ సరఫరా తగ్గకుండా తాము కూడా ఈఆర్సీకి వెళతామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.