: ఆంధ్రప్రదేశ్ నిర్ణయం మాకు ఆమోదయోగ్యం కాదు: పొన్నాల
పీపీఏను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సరైంది కాదని... తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. రెండుగా విడిపోయిన రాష్ట్రాలు కలసికట్టుగా ఉండాలని... సామరస్యంతో మెలగాలని సూచించారు.