: సమన్యాయం అనే చంద్రబాబు ఇక్కడి తెలుగువారికి అన్యాయం చేస్తారా?: హరీష్ రావు
పీపీఏలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. సమన్యాయం అంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు... ఇక్కడి తెలుగువారికి అన్యాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పీపీఏ రద్దు నిర్ణయాన్ని అమలుకానివ్వమని స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఏపీ సెక్రటేరియట్ కు విద్యుత్ అవసరం లేదా? అంటూ నిలదీశారు. చంద్రబాబు నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని అన్నారు. రైతులు, పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.